Header Banner

ఉచిత సిలిండర్ల పథకంలో కీలక మార్పులు! ఇక నుంచి నగదు ఇలా!

  Thu May 15, 2025 10:50        Politics

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సంక్షేమ పథకాల అమలు వేగం పెంచాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త నిర్ణయాల అమలుకు సిద్దం అయింది. అందులో భాగంగా ఇప్పటికే అమల్లో ఉన్న ఉచిత వంటగ్యాస్ పథకంలో కీలక మార్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. లబ్దిదారులకు అందించే నగదు చెల్లింపుల్లో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వుల జారీకి తుది కసరత్తు కొనసాగుతోంది. 

 

కీలక మార్పులు

ఏపీలో 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు దిశగా కూటమి నేతలు కసరత్తు వేగవంతం చేసారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న వేళ పథకాల అమలుకు ఇక ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన తల్లికి వందనం జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే లోగానే అమలు చేయాలని నిర్ణయించారు. కేంద్రం ఈ సారి అమలు చేసే పీఎం కిసాన్ పథకంతో పాటుగా తొలి విడత అన్నదాత సుఖీభవ నిధులు రైతు ల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నారు. ఇక.. ఇప్పటికే అమలు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకం లో మార్పులు చేస్తున్నారు. 


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

 

ముందుగానే నగదు

ప్రతీ ఏటా అర్హులైన లబ్ది దారులకు మూడు సిలిండర్ల వరకు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులకు నిర్ణయించారు. ఉచిత సిలిండర్ల పథకం అమలులో కొన్ని మార్పులు చేసి లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే నగదు జమ చేయాల ని తాజాగా జరిగిన టీడీపీ పొలిట్‌ బ్యూరో నిర్ణయించింది. దీపం పథకానికి సంబంధించి మూడు సిలిండర్ల నగదుని లబ్ధిదారుల ఖాతాలో ముందుగానే జమ చేసేందుకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో ఉచిత సిలెండర్ల పథకం అమలుకు ఏటా రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదిలో అర్హత కలిగిన లబ్దిదారుకి మూడు సిలిండర్ల ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పటి వరకు తొలుత సిలిండర్ తీసుకునే సమయంలో లబ్ది దారులు నగదు చెల్లించాల్సి వస్తోంది. ఆ తరువాత వారి ఖాతాల్లో ఆ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ముందుగానే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ కానుంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #FreeCylinderScheme #LPGSubsidy #UjjwalaYojana #GasCylinderUpdate #GovernmentScheme #WelfareScheme